- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పుర ఎన్నికలపై గవర్నర్ ఆరా.. ఎస్ఈసీ నుంచి నివేదిక కోరిన తమిళిసై
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ఎన్నికలపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ఆరా తీశారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారధికి ఫోన్ చేసి వివరాలు అడిగారు. ఎన్నికల నిర్వహణ, కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యలపై గవర్నర్ తమిళిసై ఆరా తీశారు. ఎన్నికల నిర్వహణకు అనుకూల పరిస్థితులు లేవంటూ వివిధ వర్గాలు లేవనెత్తుతున్న అంశాలను గవర్నర్.. ఎస్ఈసీతో చర్చించారు.
ఆరోగ్యశాఖ ఇచ్చిన రిపోర్ట్‌కు అనుగుణంగా అన్ని రకాల జాగ్రత్తలతో ఎన్నికలు నిర్వహిస్తామని, ప్రచార గడువును తగ్గించామని, మాస్క్ లేకుండా ప్రచారంతో పాటు పోలింగ్‌లో పాల్గొనకుండా చర్యలు చేపట్టినట్లు ఎస్‌ఈసీ పార్థసారధి ఈ సందర్భంగా వివరించారు. అయితే ఎన్నికలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఎస్‌ఈసీకి గవర్నర్ తమిళసై సూచించారు. రాష్ట్రంలో కొవిడ్ సెకండ్వేవ్వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో మున్సిపల్ ఎన్నికలను నిలిపివేయాలని బీజేపీ, కాంగ్రెస్ నేతలు గవర్నర్‌కు విన్నవించారు. దీనిపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కూడా శుక్రవారం లేఖ రాయడంతో.. స్పందించిన గవర్నర్, ఉత్తమ్‌తో ఫోన్‌లో మాట్లాడి వివరాలడిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎస్ఈసీ పార్థసారధికి ఫోన్ చేసిన గవర్నర్.. నివేదిక కోరినట్లు తెలుస్తోంది.