- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ రోజు రాజ్‌భవన్‌కు ఎవరూ రావొద్దు: గవర్నర్ బీబీ హరిచందన్
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ తన జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. ఆగస్టు 3న తన జన్మదినం సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకూడదని నిర్ణయించినట్లు తెలిపారు. కరోనా విజృంభణ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు గవర్నర్ హరిచందన్ ప్రకటనలో తెలిపారు. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు ఎవ్వరూ రాజ్‌భవన్‌కు రావద్దని బిశ్వ భూషణ్ హరిచందన్ విజ్ఞప్తి చేశారు. కరోనా ప్రమాదాన్ని తగ్గించడంలో, వైరస్ నుండి రక్షణ కల్పించడంలో టీకా సహాయపడగలదని, అర్హులైన వారందరూ వీలైనంత త్వరగా టీకాలు వేయించుకోవాలని గవర్నర్ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుతం మనం సెకండ్‌వేవ్‌లో ఉన్నామని, కొత్త వేరియంట్‌ల ఆవిర్భావం కారణంగా థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదం కూడా ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారని గవర్నర్ గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం, కొవిడ్ ప్రవర్తనా నియమావళిని అనుసరించడం తప్పనిసరన్నారు. చేతులు తరచూ శుభ్రం చేసుకోవటం కొవిడ్ -19 వ్యాప్తిని నిరోధిస్తుందని గవర్నర్ వివరించారు. టీకాలు వేసుకున్న వారు కూడా తమ ఇతర కుటుంబ సభ్యులను రక్షించుకోవడానికి ఈ మార్గదర్శకాలను పాటించాలని కోరుతూ గవర్నర్ హరిచందన్ ప్రకటన విడుదల చేశారు.