పీఎఫ్ కంట్రిబ్యూషన్ ఆగష్టు వరకు పొడిగింపు

by Harish |
పీఎఫ్ కంట్రిబ్యూషన్ ఆగష్టు వరకు పొడిగింపు
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ వల్ల ఆర్థిక వ్యవస్థ సన్నగిల్లింది. చాలామంది ఉద్యోగులకు వేతనం సరిగా రావడంలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం ఉద్యోగులకు, కంపెనీలకు ఊరట కల్పిస్తూ, వారి చేతిలో నగదు ఉండేలా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా, ఇదివరకు పీఎఫ్‌ను మూడు నెలలు ప్రభుత్వమే చెల్లించేలా నిర్ణయించింది. బుధవారం దీన్ని మరో మూడు నెలలు పొడిగించడానికి నిర్ణయం తీసుకుంది. బుధవారం కేబినేట్ ఆమోదం తెలపడంతో కంపెనీలు, ఉద్యోగుల పీఎఫ్ వాటాను ఆగష్టు వరకు ప్రభుత్వమే చెల్లించనుంది.

కేబినెట్ నిర్ణయంతో ఉద్యోగి వాటా 12 శాతం, యజమాని వాటా 12 శాతం కలిపి మొత్తం 24 శాతం వాటాను ప్రభుత్వమే భరించనుంది. ఇదివరకు మార్చి నుంచి మే వరకు దీన్ని కేంద్రమే భరించగా, తాజాగా మరో మూడు నెలల పొడిగింపుతో ఆగష్టు వరకు ప్రభుత్వమే చెల్లించనుంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా మొత్తం 72 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనాలు కలుగుతాయి. ఈ చెల్లింపులను కేంద్రం ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద భరించనుంది. అలాగే, ఈ పొడిగింపుతో కేంద్రంపై రూ. 4,860 కోట్ల భారం పడుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న కంపెనీలు ఉద్యోగులకు జీతాలను ఇవ్వడానికే ఇబ్బందులు పడుతున్నందున కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

Advertisement

Next Story

Most Viewed