- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నవంబరులో ఒక పూట బడి మాత్రమే
దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో నవంబరు 2 నుంచి నెలాకరుదాకా ప్రభుత్వ పాఠశాలలు ఒక పూట మాత్రమే నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. మంగళవారం ఆయన కడప జిల్లా సమీక్ష సమావేశానికి హాజరయ్యారు. ఈసందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ డిసెంబరులో పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దినట్లు తెలిపారు. ఈపాటికే విద్యార్థులకు బ్యాగులు, యూనిఫారాలు, పుస్తకాలన్నింటినీ సరఫరా చేశామన్నారు.
కడప జిల్లాలో 70 ఏళ్ల నుంచి ఎన్నడూ లేని విధంగా 805 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయినట్లు పేర్కొన్నారు.13 రిజర్వాయర్లలో 75 శాతం మేరకు నీటిని నిల్వ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ చీఫ్ విప్ జీ శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ టీడీపీ చేసిన తప్పిదాలను వైసీపీ సరిచేస్తున్నట్లు చెప్పారు. పోలవరానికి ఈ దుస్థితి వచ్చిందంటే టీడీపీనే కారణమన్నారు.30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు రాకుండా అడ్డుకుంటున్నది ఎవరో ప్రజలకు తెలుసని ఆయన వ్యాఖ్యానించారు.