కేంద్ర ప్రత్యక్ష, పరోక్ష బోర్డుల విలీనం కుదరదు!

by Harish |
కేంద్ర ప్రత్యక్ష, పరోక్ష బోర్డుల విలీనం కుదరదు!
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రత్యక్ష పన్ను బోర్డు(సీబీడీటీ), కేంద్ర పరోక్ష పన్నుల బోర్డు(సీబీఐసీ)లను విలీనం చేసే ప్రతిపాదనను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవటంలేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది. 2016లో ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ రీఫార్మ్ కమిషన్(టీఏఆర్‌సీ-టార్క్) రెండు బోర్డులను విలీనం చేయాలని ప్రతిపాదన ఉంచింది. సీబీడీటీ, సీబీఐసీల విలీన ప్రతిపాదన ప్రభుత్వం వద్ద ఉందన్న మీడియా ప్రశ్నకు బదులిచ్చిన మంత్రిత్వం శాఖ ‘రెవెన్యూ చట్టం,1963 కింద రూపొందించిన ఈ రెండు బోర్డులను విలీనం చేసే ప్రతిపాదన ప్రభుత్వానికి లేదని’ వెల్లడించింది. టార్క్ నివేదికను ప్రభుత్వం వివరంగా పరిశీలించిందని, ఆ సిఫార్సును ప్రభుత్వం అంగీకరించలేదని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed