- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా కేసులను ప్రభుత్వం దాస్తోంది :చంద్రబాబు
దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా కేసులను దాస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా మహమ్మరి విజృంభిస్తుంటే, జగన్ ప్రభుత్వం పదో తరగతి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతుందన్నారు. రాష్ట్రంలో రోజుకు దాదాపు 12 వేల కేసులు వస్తుంటే వాటిని దాచేసి తప్పుడు లెక్కలను చూపుతున్నారని, న్యాయస్థానాలకు సైతం ఇవే లెక్కలు చెబుతున్నారన్నారు. కరోనాను ఆరోగ్యశ్రీలోకి చేర్చలేదని, కరోనా బాధితులెవరికీ ఆరోగ్యశ్రీ అందలేదన్నారు.
ప్రభుత్వ జీవోలు పేపర్లకు మాత్రమే పరిమితమవుతున్నాయని అచరణలో లేవని హెద్దేవ చేశారు. ఏపీలో టెస్టులు తగ్గించి కేసుల తగ్గాయని ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. ఏపీ నుండి రాకుండా పక్క రాష్ట్రాలు సరిహద్దులు మూసివేశాయని, ఈపాస్‌లు ఉంటేనే అనుమతిస్తున్నారన్నారు. కరోనాపై రాజకీయం మాని ప్రజలందరికీ ఆరోగ్య సదుపాయాలు కల్పించాలన్నారు. ఎవరైనా నీలదీసి అడిగితే కేసులు పెట్టడం కాదు.. ఇలాంటి సమయంలో ప్రజలను ఆదుకోవడం ముఖ్యమని హితవు పలికారు.