అక్రమలే అవుట్ల క్రమబద్ధీకరణకు ఛాన్స్

by Shyam |
అక్రమలే అవుట్ల క్రమబద్ధీకరణకు ఛాన్స్
X

దిశ, న్యూస్‌బ్యూరో: అనుమతిలేని లేఅవుట్లలో ప్లాట్ల కొనుగోలు, అక్రమంగా లేఅవుట్లను చేసిన వారికి గుడ్ న్యూస్. రాష్ట్రంలో ప్లాట్ల లే అవుట్ల క్రమ బద్దీకరణకు ప్రభుత్వం మరోసారి అవకాశం ఇచ్చి లేఅవుట్ క్రమబద్దీకరణ పథకం(ఎల్ఆర్ఎస్)ను తీసుకువచ్చింది. ఈ మేరకు మంగళవారం జీవో 131ను విడుదల చేసింది. ఆగస్టు 26 వ‌ర‌కు చేసిన లేఅవుట్లు, విక్ర‌యించిన ప్లాట్ల క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ‌కు ఛాన్స్ ఇచ్చి ఆన్‌లైన్ ద్వారా అక్టోబ‌ర్ 15 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుకు అవ‌కాశం క‌ల్పించింది. ప్లాట్లను క్రమబద్దీకరించుకోని వారికి తాగునీరు, డ్రైనేజీ సౌకర్యం ఉండబోదని స్పష్టం చేసింది. దీంతో ప్రభుత్వానికి మరోసారి కాసుల వర్షం ఖాయంగా కనిపిస్తోంది.

100 గజాల లోపు ఉన్న వారు గజానికి రూ. 200, 101 నుంచి 300 గజాలు ఉన్నవాళ్లు గజానికి రూ. 400, 301 నుంచి 500 గజాలు ఉన్నవాళ్లు గజానికి రూ.600, 500పైన గజాలు ఉన్నవారు గజానికి రూ.750, మురికివాడ‌ల్లో గజానికి రూ. 5, ప్లాట్ల క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ‌కు ద‌ర‌ఖాస్తు రుసుం రూ. 1000, లే అవుట్ల క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ‌కు ద‌ర‌ఖాస్తు రుసుం రూ. 10,000గా నిర్ణయించారు.

Advertisement

Next Story

Most Viewed