- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్నికల మీద వున్న ప్రేమ.. రైతుల మీద లేదు
దిశ, సిద్దిపేట:
ప్రభుత్వానికి ఉప ఎన్నికల మీద ఉన్న ప్రేమ రైతుల మీద లేదని మాజీ రాజ్యసభ సభ్యుడు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వి. హనుమంత రావు అన్నారు. సిద్దిపేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ….
అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను సర్వే చేసి వెంటనే రైతులకు ఎకరానికి రూ. 20 వేల చొప్పున నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధిక వర్షపాతం, వరదల వల్ల ఇండ్లు కూలిన బాధితులకు పది వేల రూపాయల ఆర్థిక సహాయం సరిపోదని ఆయన అన్నారు. వారికి రెండు లక్షల రూపాయలను ఇవ్వాలన్నారు. హైదరాబాద్ పట్టణంలో చెరువుల మీద ఇండ్లు నిర్మించినపుడు జీహెచ్ఎంసీ అధికారులు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి వరదలు వస్తే మూసీ ప్రక్షాళన ఎలా చేస్తారనీ ప్రశ్నించారు. పేదవారు నిన్నటి వరకు కరోనా వల్ల ఇబ్బంది పడి, నేడు వరదలతో నష్ట పోతున్నారని అన్నారు. వారిని అన్ని విధాలా ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.