- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సంపదలో ప్రపంచ కుబేరులను వెనక్కి నెట్టిన అదానీ!
దిశ, వెబ్‌డెస్క్ : 2021 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రపంచ కుబేరుల జాబితాలో నెంబర్-1, నెంబర్ -2 స్థానాల్లో కొనసాగుతున్న అమెరికా దిగ్గజ పారిశ్రామికవేత్తలు ఎలన్ మస్క్, జెఫ్ బెజోస్‌లను భారతీయ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ బీట్ చేశారు. ఈ ఎకనమిక్ ఈయర్‌లో అదానీ గ్రూప్స్ నికర ఆదాయం విలువ 16.2 బిలియన్లు పెరిగినట్లు ‘బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్’ వెల్లడించింది. అదానీకి గ్రూప్స్‌కు చెందిన ఎనర్జీ, పవర్, ట్రాన్స్మిషన్, ఎంటర్ ప్రైజెస్, గ్యాస్, పోర్ట్స్ మరియు సెజ్ మొదలగు రంగాల్లో సంపద ఈ ఏడాది 90 శాతం పెరిగినట్లు బ్లూ బర్గ్ అంచనా వేసింది.
దీంతో ప్రపంచంలోనే అగ్రశ్రేణి ధనవంతులుగా కొనసాగుతున్న జెఫ్ బెజోస్ మరియు ఎలన్ మస్క్‌లను కూడా ఓడించినట్లు సమాచారం. తాజాగా వెలువడిన గణాంకాల ప్రకారం అదానీ ఆస్తుల నికర విలువ 2021లో 16.2 బిలియన్ డాలర్లు పెరిగి 50 బిలియన్ డాలర్లకు చేరుకుంది. మరోవైపు ఆసియాలో అత్యంత ధనవంతుడుగా కొనసాగుతున్న ముఖేష్ అంబానీ ఆస్తుల నికర విలువ 8.1 బిలియన్ డాలర్లు పెరిగిన విషయం తెలిసిందే.