- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘గోరేటి’ నోట.. ‘సర్కారు’ వారి పాట!
దిశ, తెలంగాణ బ్యూరో : ఆయన పాట పాడితే పక్షులు గొంతు కలుపుతయ్.. ఆయన స్టెప్పులేస్తే అందరికీ పూనకం. ప్రతి పాటలోనూ సామాజిక దృక్కోణం. పేదల కష్టాలు కనిపిస్తాయి. ప్రకృతి కూడా పులకించే పదాల అల్లిక ఆయన సొంతం. ఆయన పాటకు పల్లె ప్రజలు, ప్రకృతి మూలాధారం. రైతుల సమస్యలపై పాటలు రాశారు. రాజ్యహింస పెరుగుతున్నాదో, పేదోళ్ల నెత్తురు ఏరులై పారుతున్నదో అని రాసి మెప్పు పొందారు. ఆయనే ప్రజా కవి, గాయకుడు గోరేటి వెంకన్న. కానీ గురువారం కొత్త అవతారం ఎత్తారు. మునుపెన్నడూ ఆయన గొంతులో నుంచి రాని కొత్త పల్లవి అనివార్యమైంది. అందుకే సర్కారును కీర్తించారన్న చర్చ జోరుగా సాగుతోంది.
జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ ఎన్నికకు వెళ్తున్న కార్పొరేటర్లను ఎమ్మెల్సీగా ఉత్సాహాన్ని నింపారు. గోరేటి వెంకన్న పాటకు టీఆర్ఎస్కార్పొరేటర్లు, ఎమ్మెల్సీలు గొంతు కలిపారు. ఆయన రాగానికి కూనిరాగాలు తీశారు. తెలంగాణ భవన్ నుంచి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి బస్సులో కార్పొరేటర్లతో కలిసి ఆయన ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆయన పాడిన పాట సోషల్‌మీడియాలోనూ హల్చల్సృష్టిస్తోంది. ‘గోరేటి నోట.. సర్కారు వారి పాట’ వినిపించిందంటూ కామెంట్లు వచ్చాయి. ఆయన పాడిన పాటలో ‘సీతమ్మో.. సీతమ్మోరి రామయ్య’ అంటూ మొదలు పెట్టి.. ‘తెలంగాణ నేల అనువనువున నెగిసి పారెనో.. తరిమల్లలో వరి పాపిట పసిడి పూతలో.. ఎరుపు మడిల ఏరేసెనగనూనెబోతే ఎత్తవచ్చు నున్ననైన రోడ్లురా.. అద్దం లేకుంటే ముఖం అండ్లనే సూడవచ్చు.. ఎనకట గతుకుల రోడ్లు ఎంత మారే సూడరో.. గులాబీ రేకుల తీరుగ నగరమెల్ల వెరిసెరో.. పచ్చనైన పార్కులు ఉద్యాన వనములు.. ఎక్కడైన యెన్నోలోలె వాకిళ్లు వెలిగే’ అంటూ టీఆర్ఎస్ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్‌ను సుందరంగా తీర్చిదిద్దినదంటూ కీర్తించారు. గతంలో ఏనాడూ ఈ రకంగా ఆయన నోట పలకని అలాంటి పల్లవి ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.