- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జూన్‌లో గూగుల్ ఫొటోస్‌కు డబ్బులు చెల్లించాలా?
దిశ, ఫీచర్స్ : గూగుల్ 2015లో గూగుల్ ఫోటోస్ యాప్ ప్రారంభించగా.. ఆనాటి నుంచి ఫొటోలు, వీడియోలు ఉచితంగా సేవ్ చేసుకునే సౌలభ్యమిచ్చింది. అయితే కొంత కాలంగా ఈ సేవలకు డబ్బులు చెల్లించాలనే నిబంధన తీసుకురావాలని యోచిస్తున్న విషయం తెలిసిందే. దీని గురించి ఇప్పటికే అధికారికంగా వెల్లడించిన గూగుల్, జూన్1 నుంచి మాత్రం డబ్బులు చెల్లించి ‘గూగుల్ ఫొటోస్’ స్టోర్ చేసుకోవాలని కస్టమర్లను షాక్‌కు గురిచేసింది.
వినియోగదారులు తమ ఫొటోలు, వీడియోలు గూగుల్ ఫొటోస్‌లో 15జీబీ స్టోరేజి లిమిట్ వరకు స్టోర్ చేసుకునే అవకాశంతో పాటు.. డౌన్‌లోడ్ చేసుకునే చాన్స్ కూడా ఇచ్చింది. జూన్ 1 నుంచి డేటా లిమిట్ 15జీబీ దాటితే.. యూజర్లు తప్పకుండా గూగుల్ వన్ సబ్‌స్క్రిప్షన్ తీసుకొని ప్రీమియం చెల్లించాలి. ఇందుకోస 100 జీబీ డేటా – 30 టీబీ క్లౌడ్ స్టోరేజ్ వరకు వివిధ రకాల సబ్ స్క్రిప్షన్ ప్లాన్లను ప్రకటించింది. ఈ క్రమంలోనే 100 జీబీ గూగుల్ ప్లాన్ తీసుకోవాలంటే నెలకు రూ.149 చెల్లించాలి. అదే ఏడాదికైతే ధర రూ.1499 ఉంటుంది. 200 జీబీ ప్లాన్‌కు నెలకు రూ.219, సంవత్సరానికి రూ.2199 ఖర్చు అవుతుంది. 2టీబీ ప్లాన్ తీసుకోవాలనుకుంటే నెలకు రూ.749 కాగా ఏడాది రూ.7,500 చెల్లించాలి. ఇవి కాకుండా 10టీబీ, 20టీబీ, 30టీబీ ప్లాన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రీమియం ప్లాన్స్ ద్వారా అదనంగా సభ్యులను కూడా యాడ్ చేసుకోవచ్చు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులను ఇందులో భాగం చేసుకునే అవకాశం కల్పించింది.