- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చూసిన సినిమా వివరాలు ఇక గూగుల్ మ్యాప్స్‌లో!
దిశ, వెబ్‌డెస్క్: ఇప్పటివరకు గూగుల్ మ్యాప్స్‌లో యూజర్ ఎక్కడికి వెళ్లారు, ఎంతసేపు వెళ్లాడు, ఎన్నిసార్లు వెళ్లాడు అనే వివరాలు మాత్రమే ఉండేవి. ఇక నుంచి వినియోగదారుడు ఏ సినిమా చూశాడు అనే వివరాలను కూడా చూపించబోతోంది. ఈ వివరాలు గూగుల్ మ్యాప్స్ టైమ్‌లైన్‌లో కనిపించనున్నాయి. ఆండ్రాయిడ్ పోలీస్ వెబ్‌సైట్ ప్రచురించిన వివరాల ప్రకారం… యూజర్ వెళ్లిన థియేటర్, అక్కడ గడిపిన సమయం, ఆ సమయంలో సంబంధిత థియేటర్‌లో ప్లే అవుతున్న సినిమా టైమింగ్స్ ఆధారంగా యూజర్ ఏ సినిమా చూశాడో గూగుల్ తెలుసుకోగలుగుతుంది.
అయితే వ్యక్తిగత టైమ్‌లైన్‌లో మాత్రమే కనిపించే ఈ వివరాలు యూజర్ మాత్రమే చూడగలుగుతాడు. కావాలనుకుంటే దీన్ని ఎడిట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ ఫీచర్ ఫిబ్రవరి నుంచే అందుబాటులో ఉన్నప్పటికీ కరోనా కారణంగా వ్యక్తుల లొకేషన్ ట్రేస్ చేస్తున్న పనిలో భాగంగా ఇప్పుడిప్పుడే ప్రాచుర్యానికి వస్తోందని ఆండ్రాయిడ్ పోలీస్ తెలిపింది.
Tags: Google, Google maps, Movies, transit, commute