వ్యాక్సినేషన్‌పై అద్భుతమైన వీడియో రూపొందించిన గూగుల్

by Sujitha Rachapalli |   ( Updated:2023-08-18 16:45:48.0  )
వ్యాక్సినేషన్‌పై అద్భుతమైన వీడియో రూపొందించిన గూగుల్
X

దిశ, ఫీచర్స్ : కొవిడ్ మహమ్మారి మరోసారి వ్యాప్తి చెందుతూ, ప్రజల్లో ఆందోళన రేపుతోంది. గత రెండు, మూడు రోజుల నుంచి దేశంలో లక్షకు చేరువలో కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వ్యక్తిగత భద్రత పాటిస్తూ, కొవిడ్ రూల్స్ పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే కొవిడ్‌‌ను నిరోధించడానికి ఓ వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొంతమంది వ్యాక్సిన్ వేసుకునేందుకు ముందుకు రావడంతో పాటు ఇతరుల్లో వ్యాక్సినేషన్‌ భయాలు తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా చాలామంది వ్యాక్సిన్‌ వేసుకోవడానికి ఆసక్తి చూపించడం లేదు. ఇండియాలోనే కాకుండా పలు దేశాల్లోని ప్రజలు సైతం ఇప్పటికీ వ్యాక్సిన్‌పై అనుమాన పడుతున్నారు. కాగా వ్యాక్సినేషన్‌పై జనాల్లో నెలకొన్న భయాన్ని తొలగించేందుకు గూగుల్ వినూత్న ప్రచారం చేస్తొంది.

గూగుల్ రూపొందించిన ‘కొవిడ్-19’ అనే నిమిషం నిడివి గల వీడియో హృద్యంగా సాగింది. లాక్‌డౌన్ కాలంలో ఎలాంటి పదాలు ఉపయోగించామో చూపడంతో పాటు వ్యాక్సిన్ ఫలితంగా ఆ పదాలు ఎలా మారుతున్నాయో వివరించింది. కరోనా వల్ల మనం కోల్పోయిన సంతోషాలన్నింటినీ కళ్లకు కట్టినట్టు చూపించింది. ఆన్‌లైన్ పూజా విధానాల నుంచి గుళ్లో హారతి తీసుకోవడం, మూసివేసిన సినిమా హాల్స్ తెరుచుకోవడం, వర్చువల్ పార్టీలు, వీడియో కాల్స్ అన్నీ పోయి గెట్ టు గెదర్‌ అవుతుండటాన్ని కేవలం పదాల్లోనే చూపించిన విధానం ఎంతో బాగుంది. కాగా అందరినీ ఆలోచింపజేస్తున్న ఈ వీడియో రియల్లీ సూపర్బ్ అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఫైనల్‌గా మనం ప్రేమించిన వాటిని తిరిగి పొందాలంటే వ్యాక్సిన్‌ వేసుకోవాలనే మంచి సందేశాన్నిచ్చిన గూగుల్‌.. అంతటా అనిశ్చితి ఉన్నప్పటికీ, టీకా మాలో ఆశను కల్పించిందని వీడియోలో పేర్కొంది.

భారత్‌లో కొవిడ్ ప్రత్యేక వెబ్‌సైట్ ప్రారంభించిన గూగుల్

భారత్‌లో కొవిడ్ ప్రత్యేక వెబ్‌సైట్ ప్రారంభించిన గూగుల్

Advertisement

Next Story