- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గూగుల్ అసిస్టెంట్‌తో వాయిస్ మెసేజ్‌లు
రోజుకొక కొత్త ఫీచర్‌తో గూగుల్ అసిస్టెంట్ అప్‌డేట్ అవుతోంది. దీంతో చేతులు ఉపయోగించకుండా కేవలం వాయిస్ కమాండ్స్‌తోనే ఫోన్ ఆపరేట్ చేసే సౌకర్యం ఏర్పడుతోంది. కొత్తగా గూగుల్ అసిస్టెంట్‌తో వాయిస్ మెసేజ్‌లను కూడా పంపుకునే అవకాశాన్ని కల్పించింది గూగుల్. ఇక ‘హే గూగుల్’ అనేసి వాయిస్ మెసేజ్ పంపించాల్సిన కాంటాక్టు పేరు, చెప్పాల్సిన విషయాన్ని చెప్తే చాలు.. అదే పంపిస్తుంది. అయితే ఎస్ఎంఎస్ ద్వారా పంపాలా? లేదా వాట్సాప్ ద్వారా పంపాలా అనే విషయాన్ని ముందే ఎంచుకోవాల్సి ఉంటుంది.
టెక్స్ట్ మెసేజ్‌తో పోల్చితే వాయిస్ మెసేజ్‌లకు ఈ మధ్య డిమాండ్ పెరిగింది. వాయిస్ సర్వీస్ అనేది ఈరోజుల్లో వాకీ టాకీగా మారింది. అత్యవసర సమాచారాన్ని వేగంగా పంపించాలనుకుంటే వాయిస్ మెసేజ్‌కు మించి మరో దారి లేదు. అందుకే వాయిస్ మెసేజ్ సౌకర్యాన్ని గూగుల్ అసిస్టెంట్‌తో మిళితం చేసినట్లు గూగుల్ అసిస్టెంట్ ప్రొడక్ట్ మేనేజర్ మార్క్ రీగన్ పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఇంగ్లీష్, పోర్చుగీస్ భాషల్లో ఈ సర్వీస్ అందుబాటులో ఉందని ఆయన బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో లేదా టైప్ చేయడానికి ఇబ్బందిగా ఉన్న సమయాల్లో గూగుల్ అసిస్టెంట్ ద్వారా వాయిస్ మెసేజ్ పంపుకోవచ్చు. దీంతో పాటు వెబ్ పేజీని బయటికి చదవడం, సెల్ఫీ తీయడానికి ముందు కెమెరా చేయడం వంటి పనులను గూగుల్ అసిస్టెంట్ చేయనుందని బ్లాగ్‌లో రాశారు.