భారత్‌పై అమెరికా మాజీ రాయబారి ప్రశంసలు

by vinod kumar |
భారత్‌పై అమెరికా మాజీ రాయబారి ప్రశంసలు
X

వాషింగ్టన్: చైనా అప్లికేషన్‌లను నిషేధిస్తూ భారత్ తీసుకున్న నిర్ణయంపై అమెరికా మాజీ రాయబారి నిక్కీ హేలీ ప్రశంసలు కురిపించారు. ఐరాసకు అగ్రరాజ్య రాయబారిగా సేవంలందించిన ఆమె తాజాగా భారత్ నిర్ణయాన్ని పొగుడుతూ చైనా కంపెనీల యాప్స్ నిషేధిస్తూ నిర్ణయం తీసుకోవడం బాగుందని తెలిపారు. భారత్ తమకు ప్రధాన మార్కెట్ అని భావించే టిక్‌టాక్ యాప్ కూడా ఉందని గుర్తుచేశారు. చైనా ఆధిపత్య ధోరణికి తలవంచబోమని భారత్ స్పష్టంగా తెలియపరిచిందని, తన ధీరత్వాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నదని పేర్కొన్నారు. భారత సార్వభౌమ, సమగ్రత, రక్షణకు సంబంధించిన సమాచార భద్రత కోసం కొన్నివర్గాల సూచనల మేరకు 59 చైనీస్ యాప్స్‌పై నిషేధాన్ని విధించినట్టు కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. నిక్కీ హేలీ కంటే ముందుగానే యూఎస్ స్టేట్ సెక్రెటరీ మైక్ పొంపెయ్ కూడా భారత నిర్ణయాన్ని స్వాగతించిన విషయం విధితమే. ఈ నిర్ణయంతో ఇండియా సార్వభౌమ, సమగ్రత, రక్షణల బలోపేతానికి దోహదపడుతుందని వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story

Most Viewed