తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్..

by Anukaran |   ( Updated:2021-12-24 00:17:14.0  )
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్..
X

దిశ, వెబ్‌డెస్క్ : టీటీడీ తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి నెలకు సంబంధించి శ్రీవారి ద‌ర్శన టికెట్లను నేడు, రేపు(గురు, శుక్రవారాల్లో) విడుద‌ల చేయ‌నున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. గురువారం సాయంత్రం 4 గంట‌ల‌కు వ‌ర్చువ‌ల్ విధానంలో ద‌ర్శన టికెట్లు విడుద‌ల కానున్నాయి.

జ‌న‌వ‌రి 1, 2, 26 తేదీల‌కు 5,500 వ‌ర్చువ‌ల్ సేవా ద‌ర్శన టికెట్లు, జ‌న‌వ‌రి 13 నుంచి 22వ తేదీ వరకు 5,500 వ‌ర్చువ‌ల్ సేవా ద‌ర్శన్ టికెట్లు విడుద‌ల కానున్నాయి. రేపు ఉద‌యం 9 గంట‌ల‌కు రూ. 300 ప్రత్యేక ప్రవేశ ద‌ర్శన టికెట్లు విడుద‌ల కానున్నట్టు టీటీడీ తెలిపింది. ఈ నెల 27న ఉద‌యం 9 గంట‌ల‌కు రూమ్స్ బుకింగ్‌ చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే జనవరి నెలలో 11 నుంచి 14వ తేదీ వ‌ర‌కు రూమ్స్ కోసం తిరుమ‌ల‌లో క‌రెంట్ బుకింగ్‌కు అవ‌కాశం క‌ల్పించ‌నున్నట్టు ప్రకటనలో వెల్లడించారు.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో ఉద్యోగాలు, మంచి వేతనం, అప్లై చేయండి..

Advertisement

Next Story