- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సిద్ధిపేట ప్రజలకు శుభవార్త
దిశ, మెదక్: సిద్ధిపేట ప్రజానికానికి త్వరలో ఓ ప్రయోజనం చేకూరనున్నది. ఆ దిశగా అడుగులు ప్రారంభమైనాయి. విషయమేమిటంటే.. సిద్ధిపేట మున్సిపాలిటీ తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఆ దిశగా ఇప్పటికే మంత్రి హరీశ్ రావు కార్యాచరణకు అడుగులు వేసి.. జిల్లా అధికార యంత్రంగాన్ని సన్నద్ధం చేశారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం, శాశ్వత తాగునీటి పరిష్కారం అనే లక్ష్యాలు సాధించేలా హరీశ్ రావు ముందు చూపుతో ప్రణాళికలు సిద్ధం చేయించారు. ప్రస్తుతం సిద్ధిపేట తాగునీటి అవసరాలకు కరీంనగర్ జిల్లా యశ్వాడ నుంచి దిగువ మానేరు జలాలను 60 కి. మీ. దూరం నుంచి నీటిని తరలించడం ద్వారా దూర భారంతో తడిసి మోపెడవుతున్న ఖర్చుతో మున్సిపాలిటీకి తల నొప్పిగా తయారైంది. ఈ నేపథ్యంలో అధికారులకు మంత్రి హరీశ్ రావు పలు సూచనలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలు సిద్ధిపేటకు చేరడం, 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న మల్లన్నసాగర్ మరికొద్ది రోజుల్లో పూర్తి కానున్నండంతో పుష్కలమైన జలరాశులు నిలువ ఉండనున్నాయి. 60 కి.మీ. దూరంలోని యశ్వాడ ద్వారా కింది నుంచి పైకి నానా యాతనలు పడి నీళ్లు తెచ్చుకునే కంటే తలాపునే ఉండే మల్లన్నసాగర్ ద్వారా కేవలం ఒకే ఒక లిఫ్ట్ ద్వారా అతి సులభంగా, అతి తక్కువ ఖర్చుతో పై నుంచి కిందకు నీళ్లు తెచ్చుకోవడంపై ఆర్ డబ్ల్యూ ఎస్ అధికారులకు మంత్రి హరీశ్ రావు దిశానిర్దేశం చేశారు.