ఏపీ రైతులకు శుభవార్త.. ఇంటి వద్దకే బ్యాంకింగ్ సేవలు

by srinivas |
ఏపీ రైతులకు శుభవార్త.. ఇంటి వద్దకే బ్యాంకింగ్ సేవలు
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నదాతలకు వైసీపీ ప్రభుత్వం మరో తీపి కబురు చెప్పింది. రైతాంగానికి ఎంతో ఉపయోగకరమైన రైతు భరోసా కేంద్రాల్లో ఇక నుంచి బ్యాంకింగ్‌ సేవలను కూడా అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది. ఇన్నాళ్లూ బ్యాంకులో నగదు విత్‌డ్రా చేసుకోవాలన్నా.. జమ చేయాలన్నా..లోన్ తీసుకోవాలనుకున్నా..రుణాలు రీషెడ్యూల్ చేసుకోవాలన్నా రైతులు బ్యాంకులకు వెళ్లి నానా పాట్లు పడాల్సి వచ్చేది. ఈ సమస్యలను చెక్ పెట్టేందుకు జగన్ సర్కార్ బ్యాంక్ సేవలను రైతుల ముంగిటలకే తీసుకువచ్చింది. బ్యాంకింగ్‌ కరస్పాండెంట్ల ద్వారా ఈ సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే ప్రస్తుతం ఈ సేవలను ప్రయోగాత్మకంగా శ్రీకాకుళం జిల్లాలో ప్రవేశపెట్టారు. ఇక్కడ సక్సెస్ అయితే ఆగష్టు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవలను విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది.

గ్రామ సచివాలయాలకు అనుబంధంగా రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్రంలో 10,778 ఆర్‌బీకేలుండగా.. వీటిలో 234 అర్బన్‌ ప్రాంతంలోనూ..10,544 గ్రామీణ ప్రాంతంలో రైతులకు సేవ లందిస్తున్నాయి.ఈ ఆర్‌బీకేలన్నీ గ్రామ సచివాలయాలకు అనుబంధంగా పని చేస్తున్నాయి. ఈ ఆర్‌బీకేలలో బ్యాంకింగ్‌ సేవలందించాలని సీఎం జగన్ నిర్ణయించారు. అందుకు బ్యాంకర్లు సైతం ముందుకొచ్చారు. ఇందులో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు సుమారు 11,500 మంది బ్యాంకింగ్‌ కరస్పాండెంట్‌లను నియమించాయి. వీరిలో 8,500 మంది గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్నారు.

వీరంతా గ్రామాలకు వెళ్లి అక్కడ అకౌంట్‌లు ఓపెన్ చేయించడం, బ్యాంకు-ఆధార్‌ సీడింగ్, కేవైసీ అప్డేషన్, నగదు ఉపసంహరణ వంటి సేవలందిస్తుంటారు. అంతేకాకుండా మొబైల్‌ స్వైపింగ్‌, మిషన్‌ ద్వారా రూ.25వేల వరకు నగదు విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తారు. అలాగే పంట రుణాలకు దరఖాస్తు చేయించడం, కొత్త రుణాల మంజూరు, రీషెడ్యూల్‌ చేసుకునేందుకు సహాయసహకారాలు అందిస్తారు. అంతేకాకుండా మొబైల్‌ స్వైపింగ్‌, మిషన్‌ ద్వారా రూ.25వేల వరకు నగదు విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తారు. అలాగే పంట రుణాలకు దరఖాస్తు చేయించడం, కొత్త రుణాల మంజూరు, రీషెడ్యూల్‌ చేసుకునేందుకు సహాయసహకారాలు అందిస్తారు. ఈ నేపథ్యంలో ఆర్‌బీకేల్లో బ్యాంకింగ్‌ కరస్పాండెంట్‌లను గ్రామ సచివాలయాలు మ్యాపింగ్‌ చేస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed