నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆ సంస్థలో ఉద్యోగాల వెల్లువ

by Harish |   ( Updated:2021-07-19 07:27:32.0  )
business man
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ గోల్డ్‌మన్ శాక్స్ హైదరాబాద్‌లోని తన కార్యాలయానికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ క్యాంపస్ నుంచి మరిన్ని సేవలు అందించేందుకు రానున్న రెండేళ్ల కాలంలో కొత్త నియామకాలు చేపట్టనున్నట్టు వెల్లడించింది. ఫైనాన్షియల్ రంగంలో గోల్డ్‌మన్ శాక్స్ ప్రసిద్ధి చెందిన కంపెనీ. సంస్థ ఈ ఏడాది మార్చిలో హైదరాబాద్‌లో కొత్తగా కార్యాలయాన్ని ప్రారంభించింది. ఇందులో మొత్తం 250 మంది పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఇక్కడి నుంచి మరిన్ని సేవలందించేందుకు గానూ మరో 2 ఏళ్లలో హైదరాబాద్ కార్యాలయంలో 2 వేల మందిని నియమించుకోనున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది.

ప్రస్తుత ఏడాది చివరి నాటికి 700 మందిని నియమించుకుంటామని, ఇందులో 70 శాతం మంది కొత్తవారే ఉంటారని కంపెనీ స్పష్టం చేసింది. అలాగే, 2023 నాటికి అదనంగా మరో 2,500 మందిని కొత్తగా ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్టు, తద్వారా తమ కార్యాలయాన్ని విస్తరించనున్నట్టు వివరించింది. అంతేకాకుండా భవిష్యత్తులో సంస్థ నిర్వహించే అంతర్జాతీయ స్థాయి కార్యకలాపాలకు హైదరాబాద్ కార్యాలయాన్ని కేంద్రంగా చేసుకోనున్నట్టు గోల్డ్‌మన్ శాక్స్ ఛైర్మన్ డెవిడ్ సాల్మన్ వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed