రూ. 90లక్షల విలువైన బంగారం పట్టివేత

by Shamantha N |
రూ. 90లక్షల విలువైన బంగారం పట్టివేత
X

దిశ, వెబ్‌డెస్క్: కేరళలో భారీగా బంగారం పట్టుబడింది. షార్జా నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తుల నుంచి కస్టమ్స్ అధికారులు 2.3కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారం విలువ దాదాపు రూ.90లక్షల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. లో దుస్తులు ధరించిన మహిళా ప్రయాణికురాలి వద్ద 1.65కిలోల బంగారం గుర్తించగా, మరో వ్యక్తి బ్యాగులో 650 గ్రాములు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. విమాన సర్వీసులు పునరుద్ధరించిన తర్వాత గల్ప్ దేశాల నుంచి కేరళలోని నాలుగు అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులకు రాకపోకలు సాగుతుండగా ఇవాళ షార్జా నుంచి కాలికట్‌ ఎయిర్‌పోర్టుకు వచ్చిన ప్రయాణికుల వద్ద బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed