- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోలీసుల అదుపులో బంగారం నిందితులు…?
దిశ, ఖైరతాబాద్ : సంచలనం సృష్టించిన రెండు కేజీల బంగారం కేసు నిందితులు పంజాగుట్ట పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. నగరానికి చెందిన నగల వ్యాపారి శ్రావణ్ గెహ్లాట్ ముంబాయి నుంచి బంగారంతో బయలుదేరారు. నగరానికి వచ్చిన అనంతరం బంగారం పెట్టిన బ్యాగ్ మిస్ అయినట్టు మొదట సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసును పంజాగుట్టకు బదిలీ చేసిన విషయం విధితమే. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి నగరంలోని పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాలను, ముంబైలోని పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పరిశీలించారు.
ఆధారాలు లభించకపోవడంతో ఓ దశలో ఫిర్యాదుదారుడు పైనే అనుమానాలు వ్యక్తం చేశారు. ఫిర్యాదుదారుని విచారించగా ఒకటిన్నర కేజీల బంగారం మాత్రమే పోయినట్లు గుర్తించారు. ఫిర్యాదు దారుడు తనతో బస్సులో ప్రయాణం చేసిన వారిపై అనుమానాలు వ్యక్తం చేశాడు. ఆ దిశగా కేసు దర్యాప్తు ప్రారంభించి నిందితులను గుర్తించిన పోలీసులు, నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే పూర్తి వివరాలను మీడియాకు వివరించే అవకాశం ఉంది. కాగా ఈ కేసులో పోలీసులు చేతివాటం ప్రదర్శించినట్లు సమాచార మాధ్యమాల్లో వస్తున్న వార్తలు పూర్తి అవాస్తవమైనవని డీఐజీ నాగయ్య తెలిపారు.