- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తగ్గుతున్న బంగారం ధర
దిశ, వెబ్‌డెస్క్: బంగారం (Gold) నెమ్మదిగా తగ్గుముఖం పడుతోంది. గత వారం రోజుల్లో ఒక్కరోజు మాత్రమే లాభపడిన బంగారం ధరలు (Gold rate), మిగిలిన రోజుల్లో దాన్ని కొనసాగించలేకపోయాయి. రష్యా ప్రభుత్వం వ్యాక్సిన్ గురించిన వార్తలతో మొదలైన బంగారం పతనం, అంతర్జాతీయ మార్కెట్ల (International markets)లో ఒడిదుడుకులతో తగ్గుముఖం పడుతూ వచ్చాయి. ఈక్విటీ మార్కెట్లు లాభపడటంతో ఇన్వెస్టర్లు (Investors) బంగారంపై పెట్టుబడులను తగ్గించారని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడ్డారు.
ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు వెల్లడించే వరకూ పసిడి ధరల్లో ఈ ఒడిదుడుకులు తప్పవని, ధరలు ఇంకా తగ్గితే విక్రయాలు పెరిగే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. హైదరాబాద్ మార్కెట్లో గురువారం 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 400 తగ్గి రూ. 53,660 కి చేరుకుంది. ఇదివరకు పది గ్రాములు రూ. 59 వేల వరకూ చేరిన పసిడి, వారం రోజుల్లో సుమారు రూ. 5,500 వరకు క్షీణించింది. ఇక, 22 క్యారెట్ల బంగారం పది గ్రాములు రూ. 300 వరకు తగ్గి రూ. 49,200కి చేరింది.
అయితే, వెండి కిలో స్వల్పంగా రూ. 1,350 పెరిగి రూ. 66,900గా ఉంది. పరిశ్రమలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడంతో వెండి ధరలు ఎగిశాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే…24 క్యారెట్ల పది గ్రాముల బంగారం చెన్నైలో రూ. 54,270 ఉండగా, ముంబైలో రూ. 51,350, ఢిల్లీలో రూ. 55,200, కోల్‌కతాలో 52,870, బెంగళూరులో రూ. 53,500గా ఉంది.