దిగొచ్చిన బంగారం!

by Harish |
దిగొచ్చిన బంగారం!
X

దిశ, వెబ్‌డెస్క్: నెమ్మదిగా బంగారం దిగొస్తోంది. గతవారం అత్యధిక ధర పలికిన బంగారం అక్షయ తృతీయ సమీపిస్తున్న తరుణంలో ధరలు తగ్గుతున్నాయి. ప్రస్తుతం ఎమ్‌సీఎక్స్‌లో రూ. 235 తగ్గి రూ. 45,500 వద్ద ఉంది. ఇంతకుముందు సెషన్‌లో పది గ్రాములు రూ. 1,600 తగ్గిన బంగారం… సోమవారం ఉదయం తర్వాత మరింత దిగొచ్చాయి. వెండి ధరలు మాత్రం మే ఫ్యూచర్స్‌లో స్వల్పంగా పెరిగి కిలో రూ.42,940 కు చేరుకుంది. గడిచిన రెండు రోజుల్లోనే బంగారం రూ. 1800 వరకూ తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గడంతో ఆ ప్రభావం దేశీయ మార్కెట్లపై పడి వారం కనిష్ఠానికి పడిపోయింది. లాక్‌డౌన్ ముగిసిన తర్వాత ఆర్థిక వ్యవస్థ గాడినపడుతుందని పెట్టుబడుదారులు భావిస్తున్నారు. ఈ సంకేతాలతో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం 1675 డాలర్లకు చేరింది. వెండి స్వల్పంగా తగ్గి 15.08 డాలర్లకు చేరుకుంది.

ఇదే సందర్భంలో.. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గోల్డ్ బాండ్స్ సబ్‌స్క్రిప్షన్ సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. సావరీన్ గోల్డ్ బాండ్ స్కీమ్ ద్వారా గోల్డ్ బాండ్ గ్రాముకు రూ. 4,639 గా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బాండ్ల ఇష్యూ ఈ నెల 24తో ముగుస్తుంది. ఈ నెల 28వ తేదీన బాండ్లను జారీ చేస్తారు. లాక్‌డౌన్ ఉన్నప్పటికీ అక్షయ తృతీయ సందర్భంగా బంగారం అమ్మకాలు కొనసాగాలని బంగారం దుకాణ యజమానులు నిర్ణయించారు. ప్రముఖ జ్యువెలరీ సంస్థ టాటా గ్రూప్ తనిష్క్ ఏప్రిల్ 18 నుంచి 27 వరకు ఆన్‌లైన్ ద్వారా వెబ్‌సైట్‌లో బంగారం కొనుగోలుకు అవకాశం ఇవ్వనుంది. లాక్‌డౌన్ ముగిసిన వెంటనే కొనుగోలు చేసిన బంగారాన్ని పొందవచ్చని ప్రకటించింది.

Tags : Gold, Gold price, gold rate today, Price, MCX, Silver

Advertisement

Next Story

Most Viewed