చిరు ‘గాడ్ ఫాదర్’లో సల్మాన్ ఆట.. బ్రిట్నీ పాట?

by Shyam |
Britney Spears Chiranjeevi
X

దిశ, సినిమా : ‘ఆచార్య’ షూటింగ్ కంప్లీట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి.. తర్వాతి ప్రాజెక్ట్స్‌పై దృష్టి సారించాడు. మలయాళీ సూపర్ హిట్ ‘లూసిఫర్’తో పాటు అజిత్ ‘వివేగం’ రీమేక్స్‌కు ఓకే చెప్పిన చిరు.. ప్రస్తుతం మోహన్ రాజా డైరెక్షన్‌లో ‘లూసిఫర్’ కంప్లీట్ చేసే పనిలో పడ్డాడు. కాగా ‘గాడ్ ఫాదర్’ టైటిల్‌తో తెరకెక్కుతున్న సినిమా గురించి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఒకటి ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. హాలీవుడ్ పాప్ సెన్సేషన్ బ్రిట్నీ స్పియర్స్‌‌ను ఈ ప్రాజెక్టులో భాగం చేసేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో చిరంజీవి కోసం బ్రిట్నీతో పాట పాడించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుండగా.. మరో కామియో రోల్‌లో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ ఖాన్ కనిపించనున్నారని సమాచారం. అయితే ఈ న్యూస్‌ను మేకర్స్ అఫిషియల్‌గా కన్‌ఫర్మ్ చేయలేదు. కాగా ఈ ఇంటెన్స్ పొలిటికల్ డ్రామాకు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.

Advertisement

Next Story