- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆలయంలో దొంగతనం.. అమ్మవారి నగలు అపహరణ
దిశ, శాయంపేట: హనుమకొండ జిల్లా శాయంపేట మండలం ప్రగతి సింగారం గ్రామంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో దొంగలు అమ్మవారికి సంబంధించిన మంగళ సూత్రం కాజేసారు. గ్రామ సర్పంచ్ తెలిపిన వివరాల ప్రకారం.. రోజులాగే ఆదివారం ఉదయం ఆలయ ద్వారాలు తెరవడానికి వెళ్లిన ఆలయ వాచ్ మెన్, పూజారు లకు ప్రధాన ద్వారం తాళాలు పగల గొట్టినట్లు కనిపించింది. అనుమానంతో విషయాన్ని గ్రామ సర్పంచ్ భర్త పోతు రమణారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన స్థానిక ఎస్ఐ ప్రవీణ్ కుమార్ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లగా హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ ఐ పరిస్థితిని సమీక్షించి దొంగతనం జరిగినట్లు గుర్తించారు.
వెంటనే డాగ్ స్క్వాడ్, ఫోరేన్సిక్ బృందాలను పిలిపించి వారి సహాయంతో విచారణ చేపట్టారు. ఈ ఘటనలో అమ్మవారికి సంబంధించిన మంగళసూత్రం అపహరణకు గురైనట్లు గుర్తించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసులు వెల్లడించాల్సివుందని గ్రామ సర్పంచ్ పోతు సుమలత రమణారెడ్డి తెలియజేశారు.