చేతిలో ప్రసాదం పెట్టి.. నిశ్చితార్ధమైన అమ్మాయిని రేప్ చేసిన ‘దేవుడు’

by Anukaran |   ( Updated:2021-10-31 05:51:05.0  )
father rape attempt
X

దిశ, వెబ్‌డెస్క్ : వేరొకరితో ఎంగేజ్ మెంట్ చేసుకున్న అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాడు ‘దేవుడు’ అనే పేరుగల వ్యక్తి.. పూజ చేస్తానని ఇంటికొచ్చి ప్రసాదంలో మత్తు మాత్రలు కలిపి ఇచ్చాడు. ప్రసాదం తిన్న అమ్మాయి నిద్రలోకి జారుకున్నాక ఆమె నగ్నచిత్రాలు తీసి, అఘాయిత్యానికి కూడా పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమె నుంచి బంగారం కూడా దోపిడీ చేసినట్టు బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటన కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం కజకూటంలో ఆదివారం ఆలస్యంగా వెలుగుచూసింది.

వివరాల్లోకివెళితే.. కజకూటంలోని MSK నగర్‌లో దిలీప్ (37) అనే ‘మంత్రమూర్తి’ నివసిస్తున్నాడు. తనకు దేవుడి ఆశీస్సులు ఉన్నాయని అందరినీ నమ్మించాడు. తనను నమ్మిన వారి కోసం వారి ఇంటికి వెళ్లి అంతా మంచి జరగాలని పూజలు చేసేవాడు. దీంతో దిలీప్‌ను స్థానిక ప్రజలు దేవుడి మనిషి (God man) అని నమ్మారు. అంతేకాకుండా ‘దేవుడు’ అనే పేరుతోనే పిలిచేవారు.ఈ క్రమంలోనే ఓ అమ్మాయి తన పెళ్లి విషయంలో జాప్యం జరుగుతున్నదని అందుకు పరిష్కారం చూపాలని దేవుడి మనిషి వద్దకు వెళ్లింది.

దీంతో మీ ఇంట్లో పూజచేయాలని చెప్పి వెళ్లిన గాడ్ మ్యాన్.. ప్రసాదంలో నిద్రమాత్రలు కలిపి ఆమెకు ఇచ్చాడు. అది తీసుకున్నాక నిద్రలోకి జారుకున్న అమ్మాయిపై అత్యాచారం చేయడమే కాకుండా, నగ్నచిత్రాలు కూడా తీశాడు. ఆ తర్వాత అవి చూపించి బ్లాక్ మెయిల్ చేయడంతో పాటు భయపెట్టి ఆమెను పలుమార్లు లోబర్చుకున్నాడు. బాధితురాలి నుంచి 30 సవర్ల బంగారం, డబ్బు కూడా దోచుకున్నాడు. చివరకు బాధితురాలు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయగా నిందితుడు దిలీప్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కాగా, ఇటీవలే బాధితురాలికి వేరొక వ్యక్తితో నిశ్చితార్ధం అయినట్టు పోలీసులు వెల్లడించారు.

Advertisement

Next Story