కాలువలో పడి మేకల కాపరి మృతి..!

by Sumithra |
కాలువలో పడి మేకల కాపరి మృతి..!
X

దిశ ప్రతినిధి, ఖమ్మం:

నీళ్లు తాగేందుకు వెళ్లి కాలువలో జారిపడి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ విషాద ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం రామచంద్రాపురం సమీపంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. శనివారం సీతారామ ప్రాజెక్టు కాలువలో నీళ్లు తాగేందుకు మేకల కాపరి రాధాకృష్ణ వెళ్లాడు. దీంతో ప్రమాదావశాత్తు కాలువలో పడి మృతి చెందాడు. స్థానికులు ఆలస్యంగా గుర్తించి మృతదేహాన్ని వెలికితీశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story