Vaccine Tokens: వ్యాక్సిన్ ‘టోకెన్ల’ పంపిణీలో గోల్ మాల్..

by Shyam |   ( Updated:2021-05-29 07:35:07.0  )
Vaccine Tokens: వ్యాక్సిన్ ‘టోకెన్ల’ పంపిణీలో గోల్ మాల్..
X

దిశ, కుత్బుల్లాపూర్ : కుత్బుల్లాపూర్ సర్కిల్‌లో వ్యాక్సిన్ కూపన్ల పంపిణీలో గోల్ మాల్ జరుగుతున్నది. అధికారులు, ప్రజాప్రతినిధులు.. వారికి తెలిసిన వారికి మాత్రమే కూపన్లు ఇస్తున్నట్లు సమాచారం. కరోనా కట్టడి కోసం.. ప్రభుత్వం నిర్ణయం మేరకు సూపర్ స్ప్రెడర్లకు జీహెచ్ఎంసీ అధికారులు వ్యాక్సిన్ అందిస్తున్న విషయం తెలిసిందే.

కానీ.. వారి పేరుతో కూపన్లు పక్క దారి పట్టడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ చాటు మాటు రాజకీయంలోనూ అధికారుల్లో సమాన్వయం లోపించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు వరకు చెకింగ్ సెక్షన్లో 20 వరకు కూపన్‌లు రిజెక్ట్ అయ్యాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఐడీపీఎల్‌లోని ఓ మద్యం దుకాణం పేరుతో 19 సంవత్సరాల యువతి వ్యాక్సినేషన్ కోసం అక్కడికి చేరుకోగా.. అధికారులు ఆమెను వెనక్కి పంపించారు. అదే మద్యం దుకాణం టోకెన్‌తో వచ్చిన ఓ వృద్దురాలికి వ్యాక్సిన్ వేయడం చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Next Story