- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తీవ్రంగా దెబ్బతిన్న రంగాల్లో ఇది ముందువరుసలో ఉంది
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ మహమ్మారి కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న రంగాల్లో విమానయాన రంగం ముందువరుసలో ఉంది. కరోనా టీకాలు వచ్చినప్పటికీ ప్రతికూల పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయి. దీనివల్ల 2020-2022 మధ్య కాలంలో అంతర్జాతీయంగా విమానయాన రంగం 201 బిలియన్ డాలర్లు(రూ. 15 లక్షల కోట్లు) నష్టపోవచ్చని ఎయిర్‌లైన్స్ బాడీ ఐఏటీఏ వెల్లడించింది. భారత్‌లో విమానయాన రంగం నెమ్మదిగా మెరుగవుతోందని అభిప్రాయపడింది. కొవిడ్-19కి ముందు నాటితో పోలిస్తే ప్రస్తుతం 70 శాతం విమానాలు కార్యకలాపాలు ప్రారంభించినట్టు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
దేశీయంగా గణనీయంగా ఉన్నప్పటికీ అంతర్జాతీయ సేవలు ఇంకా కఠిన ఆంక్షల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా 20 శాతం మాత్రమే పునరుద్ధరించబడ్డాయి. ప్రత్యేక నిబంధనలతో భారత్ నుంచి 28 దేశాలకు సేవలు మొదలయ్యాయి. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ప్రస్తుత ఏడాది 11.2 బిలియన్ డాలర్ల(రూ. 86 వేల కోట్లు) గా అంచనా వేసినట్టు ఐఏటీఏ తెలిపింది. 2022 సమయానికి ఈ నష్టాలు 2.2 బిలియన్ డాలర్ల(రూ. 16.4 వేల కోట్ల)కు తగ్గుతాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో 2023లోనే ఈ రంగం లాభాలను చూడగలదని ఐఏటీఏ వివరించింది. ఇటీవల మారిన పరిస్థితుల్లో విమాన ప్రయాణీకుల వివరాలను పూర్తిస్థాయిలో డిజిటలీకరణ చేయడం అవసరమని ఐఏటీఏ డైరెక్టర్ జనరల్ విల్లీ వాల్ష్ అభిప్రాయపడ్డారు. ఇప్పుడు రద్దీ తక్కువగా ఉన్నప్పటికీ డాక్యుమెంటేషన్, వెరిఫికేషన్ లాంటి ప్రక్రియలు కొంత సంక్లిష్టంగా ఉన్నాయి. కొవిడ్ ప్రభావం పూర్తిగా తొలగిపోయాక మరిన్ని సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదముందని సూచించారు.