కరోనా ఔషధం.. ధర తగ్గించిన గ్లెన్‌మార్క్!

by Harish |
కరోనా ఔషధం.. ధర తగ్గించిన గ్లెన్‌మార్క్!
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వ్యాప్తిని తగ్గించేందుకు ప్రభుత్వాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో కొవిడ్-19 చికిత్స కోసం ఫాబిఫ్లూ బ్రాండ్‌తో పవిరఫిర్ ఔషధం రేటును తగ్గిస్తున్నట్టు గ్లెన్‌మార్క్ ఫార్మా ప్రకటించింది. ఒక ట్యాబ్లెట్‌పై 27శాతం వరకూ తగ్గిస్తున్నట్టు, ఇదివరకు రూ.103గా ఉన్నదాన్ని రూ.75కే అందించనున్నట్టు వెల్లడించింది. ధరను తగ్గిస్తున్నట్టు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొన్న గ్లెన్‌మార్క్, భారత్‌లో ఉన్న గ్లెన్‌మార్క్ కేంద్రాల్లో ఇతర దేశాలతో పోలిస్తే ఇక్కడే తకువ ధరకు ఈ ఔషధాలు తయారు చేస్తున్నందున ధరను తగ్గించడానికి వీలు కలిగిందని తెలిపింది. తాము సేకరించిన నివేదికలో ఇతర దేశాల కంటే భారత్‌లోనే తక్కువ ధరకు ఫాబిఫ్లూను విక్రయిస్తున్నట్టు తేలిందని పేర్కొంది. తాజా తగ్గింపుతో ఆ ప్రయోజనాలు భారత ప్రజలకు మరింత అందుబాటులోకి వస్తుందని కంపెనీ వెల్లడించింది. అలాగే, ఈ ఔషధం పనితీరు, సామర్థ్యం కనుగొనడానికి వెయ్యి మందిపై పరిశోధన జరపనున్నట్టు వివరించింది. కాగా, ఫాబిఫ్లూ ధర ఇతర దేశాల్లో కంటే ఇండియాలోనే తక్కువగా ఉంది. మన కరెన్సీతో పోలిస్తే జపాన్‌లో ఈ ఔషధం ధర రూ.378 ఉండగా, రష్యాలో రూ.600, బంగ్లాదేశ్‌లో రూ.350, చైనాలో రూ. 215గా ఉంది.

Advertisement

Next Story