- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మా ఆస్తి మాకు ఇవ్వండి… మామ ఇంటి ముందు కోడలు, మనవరాళ్ల నిరాహారదీక్ష
దిశ, హుజురాబాద్: తమకు భూమి ఇవ్వకుండా తమను తన అత్తమామలు, అడబిడ్డలు నానా ఇబ్బందులు పెడుతున్నారని తనకు న్యాయం చేయాలంటూ కోడలు, మనవరాళ్లు టెంట్ వేసుకొని నిరాహార దీక్ష కు దిగారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం రాయికల్ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే బాధిత మహిళ భర్త శ్రీనివాస్ రెడ్డి మృతి అనంతరం మామ తిరుపతిరెడ్డి నుండి రావాల్సిన ఆస్తి ఇవ్వమంటే ఇవ్వడం లేదని కోడలు లత తన ఇద్దరు కుమార్తెలు మేఘన, రుచిత లతో ఇంటి ముందు టెంట్ వేసి కూర్చునట్లు పేర్కొన్నారు.
పెండ్లిడుకు వచ్చిన ఇద్దరు ఆడ పిల్లలతో న్యాయ పోరాటం చేస్తున్న మహిళ పరిస్థితిని చూసిన ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టారు. బాధిత మహిళకు మద్దతుగా రెడ్డి సంఘం, మహిళా సంఘం వాళ్ళు నిలిచారు. భర్త శ్రీనివాస్ రెడ్డి చనిపోయినప్పటి నుండి మామ తిరుపతిరెడ్డి ఆస్తి ఇవ్వడం లేదని ఇద్దరు అమ్మాయిలు పెళ్లికి ఎదిగారని లత ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం జరిగేదాకా న్యాయపోరాటం చేస్తానని పేర్కొంది. వెంటనే తన మామ తిరుపతిరెడ్డి ఆస్తిని పంచేలా అధికారులు, పోలీసులు న్యాయం చేయాలని వేడుకున్నారు. విషయం తెలుసుకున్న సైదాపూర్ ట్రైనీ ఎస్ఐ తిరుపతి అక్కడకు వెళ్లి వారిని శాంతిపజేశారు.