50శాతం కుటుంబాలకు రూ. 7,500 నేరుగా అందించాలి : రాహుల్ గాంధీ

by vinod kumar |   ( Updated:2020-05-08 01:55:23.0  )
50శాతం కుటుంబాలకు రూ. 7,500 నేరుగా అందించాలి : రాహుల్ గాంధీ
X

న్యూఢిల్లీ: కరోనా విపత్తు నుంచి బయటపడేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. కేంద్రానికి పలు సూచనలు చేశారు. ముఖ్యంగా లాక్‌డౌన్‌తో నానాకష్టాలు ఎదుర్కొంటున్న వలస కార్మికులను ఆదుకోవాలని సూచించారు. వారిని ఆదుకునేందుకు దేశంలోని 50శాతం పేద కుటుంబాలకు రూ. 7,500 నేరుగా అందించాలని చెప్పారు. వలస కార్మికుల కోసం ప్రత్యేకంగా ప్రణాళిక రచించే దశకు చేరుకున్నామా? అనే ప్రశ్నలకు ఆయనపై విధంగా స్పందించారు. వారికి నేరుగా సొమ్ము అందించి ఆదుకోవాలని, ఇది పెద్ద కష్టమేమీ కాదని తెలిపారు. రాహుల్ గాంధీ శుక్రవారం విలేకరులతో ఇ-ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సమావేశంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ)ను ఆదుకునేందుకు ఆయన పలు సలహాలిచ్చారు. వేతన భద్రత కింద రూ. లక్ష కోట్లు, ఆరు నెలల వడ్డీపై సబ్సిడీలాంటి ప్రతిపాదనలను ఆయన ముందుకు తెచ్చారు. ఎంఎస్ఎంఈలు దారుణంగా నష్టపోతున్న విషయాన్ని మనమంతా గమనిస్తున్నాం. వాటిని ఆదుకోకుంటే ఆర్థిక వ్యవస్థకు తీరని నష్టం వాటిల్లుతుందని అన్నారు. వాటిని కాపాడుకునేందుకు పటిష్ట ప్రణాళికలు వేయాలని చెప్పారు. అలాగే, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలనుకుంటే.. కేవలం ఎంఎస్ఎంఈలను మాత్రమే ఆదుకుని భారీ పరిశ్రమలను వదిలిపెట్టడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఎందుకంటే వీటి మధ్య పరస్పర సంబంధాలుంటాయని, పెద్ద పరిశ్రమలను నష్టాలకే వదిలిపెట్టినా.. దాని ప్రభావం చిన్న పరిశ్రమలపైనా పడుతుందని చెప్పారు.

tags: lockdown, migrants, financial help, rahul gandhi, support

Advertisement

Next Story

Most Viewed