- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమ్మాయిలూ.. అతడిని పరిచయం చేసుకున్నారో.. ఇక అంతే!
దిశ, వెబ్‌డెస్క్ : కొందరి పరిచయాలను మర్చిపోలేం. కొన్ని మంచి స్నేహాలు, మరికొన్ని చెడు స్నేహాలు. ఈ రెండు జీవితాంతం గుర్తుండిపోతాయి. అదే జరిగింది కొందరి యువతులు, మహిళలకు. స్నేహం ముసుగులో ఓ యువకుడు చేసిన మోసంతో లక్షల రూపాయలను పోగొట్టుకోవడంతోపాటు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వచ్చింది.
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌కు చెందిన ఎండీ అక్రమ్ బిన్ అహ్మద్ అలియాస్ అక్రంఖాన్(23) పాలిటెక్నిక్ చదివి జులాయిగా తిరుగుతున్నాడు. ఈ క్రమంలో కొంత మంది మహిళలను పరిచయం చేపుకున్నాడు. వారితో మంచిగా మాట్లాడుతూ బుద్ధిమంతుడిలా నటించాడు. మంచోడే కదా అని ఆ మహిళలు అతడితో ఫ్రెండ్ షిప్ చేశారు. ఫోన్లు మాట్లాడడం, చాటింగ్ చేయండం చేశారు. అతడితో ‘క్లోజ్’గా ఫోటోలు సైతం దిగారు. వాటిని స్క్రీన్ షాట్లు తీసుకున్న అక్రంఖాన్ తన వికృత రూపాన్ని బయటపెట్టాడు.
వారితో మాట్లాడిన కాల్స్, వీడియోలను సదరు మహిళలకు పంపి.. డబ్బులు ఇవ్వకపోతే మీ కుటుంబ సభ్యులకు పంపిస్తానని బ్లాక్ మెయిల్ చేస్తూ వారిపై అత్యాచారాలకు పాల్పడ్డాడు. వాటిని కూడా వీడియోలు తీసి డబ్బులు డిమాండ్ చేశాడు. అలా ఓ మహిళా నుంచి రూ.18 లక్షలు తీసుకున్నాడు. అయినా అతడి వేధింపులు ఆగకపోవడంతో సంగారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు అక్రంఖాన్‌ను అరెస్ట్ చేశారు.