ప్రియుడి ఇంటి ఎదుట.. ప్రియురాలి బైఠాయింపు

by Sridhar Babu |
ప్రియుడి ఇంటి ఎదుట.. ప్రియురాలి బైఠాయింపు
X

దిశ, జగిత్యాల: జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలో ప్రేమించిన యువకుడు మోసం చేశాడనంటూ ఓ యువతి ప్రియుని ఇంటిముందు బైఠాయించింది. రేకుర్తి గ్రామానికి చెందిన శ్రీవాణి అనే యువతి ప్రియుడి ఇంటి ఎదుట నిరసన తెలుపుతూ ఆందోళన చేపట్టింది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్న యువతి ప్రియుడితో వివాహం జరిపించేవరకూ అక్కడి నుంచి వెళ్లేది లేదని స్పష్టం చేసింది. యువతి ఆందోళనతో ఇంటికి తాళం వేసి ప్రియుడి కుటుంబ సభ్యులు పరారయ్యారు.

Advertisement

Next Story