- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇదో వింత ట్విస్ట్.. ప్రేమాయణం ముగిసిందని ప్రేయసి ఏం చేసిందంటే ?
దిశ, వెబ్ డెస్క్ ; ప్రేమ పుట్టడం , వికటించడం , విడిపోవడం మనం తరచూ చూస్తున్నాం. అయితే ప్రేమలో ఎవరో ఒకరు మోసం చేయడం, ఇంకొకరు బాధ పడటం, ఇంకా ఎక్కువైతే ఏదో ఒకటి చేసుకోవడం జరుగుతూనే ఉన్నాయి. అయితే ప్రేమించిన వ్యక్తి మోసం చేస్తే ఆమె మీద కక్ష సాధించడానికి కొందరు చేసే దాడులూ మనం నిత్యం చూస్తూనే ఉన్నాం అయితే ఇక్కడ ప్రేమించిన వ్యక్తి తనను కాదని వేరే మహిళతో ప్రేమాయనం నడుపుతున్నాడని తెలిసి ఆమెనే కడతేర్చేందుకు ప్రయత్నించింది ఆ మాజీ ప్రేయసి.. ఇక్కడ ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే.. వాళ్లిద్దరూ ఎప్పటి నుంచో స్నేహితులే..
ఇద్దరితో ప్రేమాయణం
కర్నాటకలోని మడుగు గ్రామానికి చెందిన గంగోత్రి, మౌనికలు మంచి స్నేహితులు. అయితే వీరికి గంగరాజు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. మొదట్లో ఇద్దరితో స్నేహం చేసిన గంగరాజు నిజంగా మాంచి ముదురే. ఇద్దరినీ ముగ్గులోకి దింపాడు. ఒకరికి తెలియకుండా ఒకరితో ప్రేమాయణం నడిపాడు. ఇద్దరు అమ్మాయిలు ప్రేమలో మునిగిపోయారు. పెళ్లి చేసుకోవాలని కూడా ఫిక్స్ అయ్యారు. అయితే గంగరాజు ప్రేమ బాగోతం వాళ్ల ఇంట్లో తెలిసింది.
ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్.. గంగరాజు మౌనికలది ఒకే వర్గం కావడంతో ఇంట్లో వాళ్లు ఓకే చెప్పేశారు. ఇంకేముంది గంగోత్రి ప్రేమాయణానికి ఎండ్ కార్డ్ వేశాడు గంగరాజు.. అయితే గంగరాజు తనను వదిలేయడానికి తన స్నేహితురాలే కారణం అని ఆమె పై కోపం పెంచుకుంది గంగోత్రి. కోపంతో ఊగిపోయిన గంగోత్రి స్నేహితురాలి పై కక్ష పెంచుకుంది. చిన్న నాటి స్నేహాన్ని మరచి ఆమె పై కిరాతకంగా దాడి చేసింది. దాంతో మౌనిక చేతికి , మెడకు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆమెను ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు గంగోత్రి ని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.