తండ్రి కోసం ఎదురు చూస్తుండగా..!

by srinivas |   ( Updated:2020-02-27 01:23:58.0  )

నిర్భయ, దిశ వంటి ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా కామాంధులను అడ్డుకోలేకపోతున్నారు. తప్పు చేసినా తప్పించుకోగలమన్న ధైర్యమో లేక జైలు కెళ్లినా విడుదలవుతామన్న భరోసానో కానీ.. అత్యాచారాలకు పోలీసులు అడ్డుకట్టవేయలేకపోతున్నారు. తండ్రి కోసం ఎదురుచూస్తున్న బాలికను ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడో కామాంధుడు. కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీ సమీపంలో చోటుచేసుకున్న దారుణం వివరాల్లోకి వెళ్తే…

నూజివీడుకు చెందిన వ్యక్తి పనిపై బయటకు వెళ్లి రాత్రయినా తిరిగి రాకపోవడంతో కంగారు పడిన కుమార్తె రోడ్డుపైకి వచ్చి తండ్రి కోసం ఎదురుచూడసాగింది. అదే సమయంలో అటునుంచి వెళ్తున్న నిందితుడు ఆమెను బెదిరించి ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ట్రిపుల్ ఐటీ సమీపంలో వదిలేసి పరారయ్యాడు. దీంతో బాలిక రోడ్డుపై ఏడుస్తూ కూర్చుంది.

అటుగా పెట్రోలింగ్‌కు వెళ్తున్న పోలీసు వాహనంలోని పోలీసులకు బాలిక నూజివీడు ట్రిపుల్ ఐటీ సమీపంలో కనిపించడంతో ఆమెను ఆరాతీసిన పోలీసులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బాలిక పరిస్థితి విషమంగా ఉండడంతో మరింత మెరుగైన చికిత్స కోసం విజయవాడ తరలించారు. కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడి కోసం వేట ప్రారంభించారు.

Advertisement

Next Story