- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
దిశ, న్యూస్‌బ్యూరో
కోవిడ్-19(కరోనా)ను అరికట్టేందుకు అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. గురువారం జిహెచ్‌ఎంసీ కార్యాలయంలో కమిషనర్ డిఎస్ లోకేష్ కుమార్‌తో పాటు అదనపు కమిషనర్లు, జోనల్ కమిషనర్లు, హెచ్‌ఓడీలతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..శానిటేషన్ వర్కర్లు తప్పనిసరిగా రేడియం ఆఫ్రాన్, గ్లౌజులు, మాస్కులు ధరించాలన్నారు. అందుకు శానిటేషన్ సూపర్ వైజర్లను, ఫీల్డ్ అసిస్టెంట్‌లను బాధ్యులను చేయాలన్నారు.అలాగే మొదటి విడత బయోమెట్రిక్ హాజరు నమోదు సమయాన్ని ఉదయం 5నుంచి 6గంటల వరకు మాత్రమే అనుమతించాలన్నారు. శీతాకాలంలో బయోమెట్రిక్ హాజరును ఉదయం 7:30గంటల వరకు అనుమతించామని, ప్రస్తుతం వేసవిలో జూన్ వరకు ఉదయం 5గంటల నుంచే శానిటేషన్ ప్రక్రియ ప్రారంభం కావాలన్నారు.ఉదయం 6:30గంటలలోపు రోడ్లపై పారిశుధ్య పనులు పూర్తిచేసి, ఆ చెత్తను వెంటనే తొలగించుటకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఉదయం 7తర్వాత ప్రజలు రోడ్లపైకి వస్తున్నందున పారిశుధ్య పనులు, చెత్త తరలింపునకు ఇబ్బందిగా ఉంటుందన్నారు. ఇంజినీరింగ్ విభాగం డీఈలకు, ప్రతి డీఈ పరిధిలో నియమితులైన ఇద్దరు ఏఈలకు తమ విధులపై అవగాహన కల్పించనున్నట్టు వివరించారు. బయోమెట్రిక్ హాజరు నమోదు వద్ద హ్యాండ్ శానిటైజర్లను అందుబాటులో ఉంచాలని చెప్పారు.శానిటేషన్ సూపర్ వైజర్లు, అసిస్టెంట్‌లు కూడా రేడియం ఆఫ్రాన్‌లను తప్పనిసరిగా ధరించాలన్నారు. 7గురు శానిటేషన్ వర్కర్లను ఒక గ్రూపుగా నియమించి విధులు అప్పగిస్తున్నట్టు, వారిలో ఒకరు వారాంతపు సెలవులో ఉంటే 6గురు తప్పనిసరిగా విధులలో ఉండాలన్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా దేశంలోని కొన్ని నగరాల్లో బయోమెట్రిక్ హాజరును తాత్కాలికంగా తొలగించారని, మన జీహెచ్‌ఎంసీలో కూడా ఆ విధంగా బయోమెట్రిక్ హాజరు తొలగింపు అంశంపై సమావేశంలో చర్చించారు. అయితే శానిటేషన్ వర్కర్ల హాజరు నమోదులో ఇబ్బందులు ఎదురవుతాయని, కార్మికుల గైర్హాజరు వలన పారిశుధ్య పనులకు విఘాతం కలుగుతుందని సమావేశంలో తేలింది. అదే విధంగా బయోమెట్రిక్ హాజరు నమోదుతో విధులకు రాని వర్కర్ల వివరాలు వెంటనే తెలుస్తున్నాయని, తదనుగుణంగా చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు మేయర్ కు వివరించారు. ఇకమీదటట 3నెలల పాటు విధులకు గైర్హాజరైన శానిటరీ వర్కర్లను బయోమెట్రిక్ హాజరు సిస్టమ్ నుంచి ఆటోమెటిక్‌గా తొలగించే సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. అలాగే రెగ్యులర్ ఉద్యోగులు కూడా 30రోజుల పాటు విధులకు అనధికారికంగా గైర్హాజరైతే కఠిన చర్యలు ఉంటాయన్నారు.
Tags: ghmc meet, carona restrict, mayor rammohan, hyd, municipal officers