- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐసీఏ అధ్యక్షుడిపై గవాస్కర్ ఫైర్ !
దేశంలో కరోనా తీవ్ర ప్రభావం చూపిస్తుండటంతో బీసీసీఐకి కష్టమొచ్చిపడింది. ఇప్పటికే దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ రద్దు కాగా.. ప్రస్తుత పరిస్థితుల్లో ఐపీఎల్ జరిగే అవకాశం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే బీసీసీఐ ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో కొన్ని రోజుల కిందట మీడియాతో మాట్లాడిన ఇండియన్ క్రికెటర్స్ అసోసియేషన్(ఐసీఏ) అధ్యక్షుడు అశోక్ మల్హోత్రా ఒక ప్రతిపాదన చేశారు. గతంలో లాగా బీసీసీఐకి ఇప్పుడు ఆదాయం లేనందున క్రికెటర్లు తమ వేతనాల్లో కోత విధించుకోవాలని మల్హోత్రా సూచించారు. ఈ వ్యాఖ్యలపై టీం ఇండియా మాజీ కెప్టెన్ సునిల్ గవాస్కర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై మీడియాకు రాసిన లేఖలో మల్హోత్రా లేవనెత్తిన విషయాలపై గవాస్కర్ మండిపడ్డారు. ‘ఆయన బీసీసీఐకి మంచి చేయాలనే ఉద్దేశంతోనే ఈ ప్రతిపాదన చేసినట్లు అర్థమవుతోంది. కానీ, ఆటగాళ్ల జీతాల్లో కోత గురించి మాట్లాడే అధికారం ఆయనకు ఎవరిచ్చారు’ అని గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అయినా.. ప్రస్తుతం టీం ఇండియా ఆటగాళ్లు, ఫస్ట్ క్లాస్ క్రికెటర్లు ఎవరూ ఐసీఏలో సభ్యులు కాదు. అలాంటప్పుడు ఆయనెలా వారి తరపున వకాల్తా పుచ్చుకొని మాట్లాడతారు’ అని గవాస్కర్ దుయ్యబట్టారు.
ఇదే విషయంపై బీసీసీఐ ట్రెజరర్ అరుణ్ ధుమాల్ స్పందిస్తూ.. ‘వేతనాల కోత విషయంలో అందరి ప్రయోజనాలను పరిగణలోకి తీసుకుంటాం. అయినా ఇంత వరకు ఆ విషయంపై ఎలాంటి ఆలోచన లేదు. పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాతే ఈ విషయంపై ఆలోచిస్తామని’ ఆయన స్పష్టం చేశారు.
Tags: BCCI, IPL, Gavaskar, ICA President Malhotra