ఐఎస్బీతో గౌతంరెడ్డి చర్చ

by srinivas |
ఐఎస్బీతో గౌతంరెడ్డి చర్చ
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో పరిశ్రమలను ప్రోత్సహించడానికి అనువైన పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి వెల్లడించారు. గురువారం ఆయన నెల్లూరు జిల్లాలోని క్యాంప్‌ కార్యాలయం నుంచి ఐఎస్‌బీతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పాలసీ ల్యాబ్, రిమోట్ వర్క్, పెట్టుబడుల ఆకర్షణ, నైపుణ్యం తదితర అంశాలపై చర్చించారు. రిమోట్ వర్క్ పై త్వరలో ఎంవోయూలు కుదుర్చుకుంటామని తెలిపారు. విశాఖ కేంద్రంగా ఫార్మాతోపాటు పలు రంగాలను అభివృద్ధి చేసేందుకు విదేశీ విశ్వవిద్యాలయం జాన్స్ హాప్ కిన్స్ ప్రతిపాదనలతో ముందుకు వచ్చినట్లు పేర్కొన్నారు.

Advertisement

Next Story