- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనాకు వాళ్లు భయపడరు : గంభీర్
దిశ, స్పోర్ట్స్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ఆడే ఆటగాళ్లు ఎవరూ కరోనాకు భయపడరని, ఒకరిద్దరి కోసం లీగ్ మొత్తాన్ని రద్దు చేయలేరని టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ (Gowtham gambir) అన్నారు. యూఏఈలో ఉన్న ఆటగాళ్లందరూ కచ్చితమైన నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన గంభీర్.. ‘ఐపీఎల్‌లో ఆడుతున్న క్రికెటర్లు BCCI నిర్థేశించిన నిబంధనలు తప్పకుండా పాటించాలి. బయోసెక్యూర్ వాతావరణంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఏ ఒక్కరి కోసమే టోర్నీని రద్దు చేయలేరు.
నాకు తెలిసి ఐపీఎల్ ఆడుతున్న ఆటగాళ్లు ఎవరూ కరోనా(COVID-19)కు భయపడరు. అందరూ వ్యక్తిగత జాగ్రత్తలు పాటించడం ముఖ్యం. టీం ఇండియా ఆటగాళ్లు చాలా కాలంగా క్రికెట్‌కు దూరమయ్యారు. కాబట్టి ఐపీఎల్ ద్వారా వాళ్లు ఫామ్‌లో ఉన్నారా లేదా ఫామ్ కోల్పోయారా అనే విషయాలు సీజన్ ప్రారంభమయ్యాక తెలుస్తుంది.’ అని అన్నారు. ఇక యువరాజ్ తిరిగి క్రికెట్ ఆడాలను కోవడంపై స్పందించిన గంభీర్.. అతడు పంజాబ్ తరపున ఆడాలనకుంటే ఆడొచ్చు. ఒక క్రికెటర్‌ను ఆడటం ప్రారంభించు, ముగించు అని మనం బలవంతం చేయలేమని అన్నాడు.
Read Also…