గంగూబాయి ఎప్పుడైనా రావొచ్చు : భన్సాలీ

by Jakkula Samataha |   ( Updated:2023-10-10 16:58:21.0  )
గంగూబాయి ఎప్పుడైనా రావొచ్చు : భన్సాలీ
X

దిశ, వెబ్‌డెస్క్ : బాలీవుడ్ బ్యూటీ ఆలియాభట్, సెలెబ్రేటెడ్ ఫిల్మ్ మేకర్ సంజయ్ లీలా భన్సాలీ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘గంగూబాయి కతియావాడి’. ముంబై మాఫియా క్వీన్ ‘గంగూబాయి’ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా 2020 సెప్టెంబర్‌లోనే విడుదల కావాల్సి ఉండగా, కొవిడ్ పాండమిక్ కారణంగా ఆలస్యమైంది. ఇక లాక్‌డౌన్ తర్వాత అక్టోబర్‌లో లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ చేసిన చిత్ర యూనిట్.. విడుదలపై బిగ్ అప్‌డేట్ ఇస్తూ ఇన్‌స్టాలో ఓ వీడియో పోస్ట్ చేసింది.

‘నిప్పులు చెరిగే కళ్లతో, ఉగ్రరూపితమైన గంగూబాయి పాలన కోసం వేచి ఉండండి. బ్రేవ్, బోల్డ్.. గంగూబాయి 2021లో ఎప్పుడైనా రావొచ్చు’ అని భన్సాలీ తన ఇన్‌స్టా అకౌంట్‌లో షేర్ చేశాడు. కాగా ఈ సినిమా‌పై అభ్యంతరాలు వ్యక్తం చేసిన గంగూబాయి కుమారుడు బాబూజీ రాజీ షా.. హీరోయిన్, దర్శకుడితో పాటు ‘ద మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై’ పుస్తకాన్ని రాసిన హుస్సేన్ జైదీపై బాంబే సివిల్ కోర్టులో కేసు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో గుంగూబాయిని అసభ్యంగా చిత్రీకరించినందుకు పరువు నష్టం దావావేస్తామని రాజీ షా పేర్కొనగా, ఈ విషయంపై స్పందించాలని చిత్ర యూనిట్‌కు సమన్లు పంపిన కోర్టు.. జనవరి 7 వరకు గడువునిచ్చింది. మరి ఈ వ్యవహారంపై చిత్రయూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Advertisement

Next Story

Most Viewed