యువకుడిపై గ్యాంగ్ రేప్.. వీడియోలతో బ్లాక్‌మెయిల్

by Sumithra |   ( Updated:2021-06-12 04:07:02.0  )
young man news
X

దిశ, వెబ్‌డెస్క్: ఆన్లైన్ స్నేహాలు, డేటింగ్ యాప్స్ వలన యువత చెడిపోతుంది. కంటికి కనిపించనివారితో స్నేహం చేసి, వారితో చాటింగ్ లు, మీటింగ్ లు కొన్నిసార్లు వారి ప్రాణాలమీదకు తెస్తున్నాయి. తాజాగా డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన ఫ్రెండ్స్ ని కలవడానికి వెళ్లిన యువకుడిపై అత్యాచారానికి పాల్పడ్డారు కొందరు యువకులు. అంతేకాకుండా ఆ దృశ్యాలను వీడియో తీసిన నిందితులు అతడిని బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసింది.

ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నొయిడాలో పాలిటెక్నిక్ చదువుతున్న ఓ యువకుడికి డేటింగ్ యాప్ లో ముగ్గురు యువకులుపరిచయమయ్యారు. అందులో గౌతమ్ అనే యువకుడు బాధిత యువకుడిని బయట కలవడానికి రమ్మని పిలిచాడు. దీంతో ఆ యువకుడు గౌతమ్ చెప్పిన రూమ్ కి వెళ్ళాడు. అక్కడ గౌతమ్ తో పాటు మరో ముగ్గురు యువకులు బాధిత యువకుడిపై దాడి చేసి, అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ దృశ్యాలను వీడియో తీసి డబ్బులు ఇవ్వాలంటూ బెదిరించారు. అతని వద్ద నుండి బలవంతంగా అకౌంట్ లో ఉన్న రూ. 5000 రూపాయలను ట్రాన్స్ ఫర్ చేయించుకున్నారు. ఆ తర్వాత కూడా యువకుడికి ఫోన్ చేసి రూ.2 లక్షలు డిమాండ్ చేయడంతో, బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి విచారించగా.. నలుగురు యువకులు ఒకే కుటుంబానికి చెందిన వారని, డేటింగ్ యాప్ లో యువకులను మాయలో పడేసి బెదిరిస్తారని పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story