- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భాగ్యనగరంలో వినాయక నిమజ్జన వేడుకలు..!
దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ మహానగరలో వినాయక నిమజ్జనం కోలాహలంగా సాగుతోంది. 11 రోజులు పూజలు అందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి చేరుకుంటున్నాడు. భాగ్యనగరంలో ప్రసిద్ద ఖైరతాబాద్ విఘ్నేశ్వరుడు నిమజ్జనానికి బయలుదేరాడు. భక్తులు నృత్యాలు, జయజయధ్యానాల మధ్య లంబోధరుడు పయనం సాగిస్తున్నాడు. కరోనా కారణంగా కేవలం తొమ్మిది అడుగుల మట్టి విగ్రహంగా రూపుదిద్దుకున్న గణపయ్య.. ఈ ఏడాది ధన్వంతరి నారాయణగా భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి చేతిలో వనమూలికలు, వైద్య పుస్తకంతో పాటు కుడివైపున మహాలక్ష్మీదేవి, ఎడమవైపున సరస్వతి విగ్రహాలను ప్రతిష్టించారు. గణనాథుల రాకతో ట్యాంక్ బండ్ పరిసరాలు సందడిగా మారాయి.
ఇక నగరంలో వినాయక నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా జరుగుతున్నాయని హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ స్పష్టం చేశారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ గణేష్ నిమజ్జన వేడుకలు జరుగుతున్నాయని తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు అంజనీకుమార్ వెల్లడించారు.