కరోనాపై పోరాటానికి గల్లా జయదేవ్ కంపెనీ సాయం 5 కోట్లు

by srinivas |   ( Updated:2020-03-31 06:14:11.0  )
కరోనాపై పోరాటానికి గల్లా జయదేవ్ కంపెనీ సాయం 5 కోట్లు
X

కరోనా వ్యాధి నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మద్దతునిస్తూ టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కంపెనీ అమర రాజా గ్రూప్ ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు 5 కోట్ల రూపాయలు విరాళం అందించింది. అంతే కాకుండా మరో 2.5 కోట్ల రూపాయలను ఎంపీ ల్యాండ్స్ నుంచి తన పార్లమెంటరీ నియోజకవర్గంలో కరోనాపై పోరాటానికి విరాళంగా అందజేశారు.

సీఎస్ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ)లో భాగంగా అమర రాజ గ్రూప్, రాజన్న ట్రస్ట్ చిత్తూరు, గుంటూరులలో కరోనాతో పోరాడటానికి వైద్య అవసరాలకు చేయూతనిస్తూనే ఉందని, వైరస్ నియంత్రణ, నివారణకు ప్రజారోగ్యం, అవసరమైన సామగ్రిపై దృష్టి పెట్టడానికి కృషి చేస్తున్నామని ఆ సంస్థ ప్రకటనలో వెల్లడించింది. ఇటీవలే తమ సంస్థ చిత్తూరు జిల్లా కలెక్టర్ సమక్షంలో రూ. 5 లక్షల విలువైన మాస్క్‌లు, చేతి తొడుగు (గ్లౌస్) లు మరియు శానిటైజర్లు విరాళంగా ఇచ్చిందని తెలిపారు. అలాగే ఈ సంస్థ తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు కోటి రూపాయలను మరియు ఉద్యోగుల ఒక రోజు జీతాన్ని విరాళంగా అందించింది.

Tags: amar raja group, cm relif fund, donation, galla jayadev

Advertisement

Next Story