త్వరలో ప్రజా రవాణా!

by Shamantha N |
త్వరలో ప్రజా రవాణా!
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నాళ్లో వేచిన ఉదయం అన్నట్టు..40 రోజుల లాక్‌డౌన్ తర్వాత ప్రజా రవాణా వ్యవస్థ త్వరలో ప్రారంభించనున్నట్టు కేంద్ర రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కరి తెలిపారు. దీనికి అవసరమైన మార్గదర్శకాలను రూపొందిస్తున్నామని వెల్లడించారు. కరోనా వ్యాప్తి చెందకుండా భౌతిక దూరం పాటించేలా ఈ మార్గదర్శకాలు ఉంటాయని చెప్పారు. దీనికోసం కారు, బస్సు ఆపరేటర్స్ కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులతో బుధవారం నితిన్ గడ్కరి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

రవాణా రంగంలోని అన్ని సమస్యలూ తనకు తెలుసునని, పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లతో ఎప్పటికప్పుడు చర్చిస్తున్నామని వివరించారు. కరోనా సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుందామని, పరిశ్రమ వర్గాలకు సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో చైనాలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా లేరని, దీన్ని దృష్టిలో ఉంచుకుని విదేశీ పెట్టుబడిదారులను ఇండియాలోని పరిశ్రమ వర్గాలు ఆకర్షించాలని పరిశ్రమ వర్గాలకు సూచించారు. కరోనాతో పాటు, ఆర్థిక వ్యవస్థ మందగమనాన్ని అధిగమిస్తామని, ప్రజా రవాణా అంశంలో లండన్ మోడల్‌ను పరిశీలిస్తున్నట్టు నితిన్ గడ్కరి తెలిపారు. ప్రజా రవాణాకు సంబంధించి సమాఖ్య ప్రతినిధులు మంత్రికి పలు సూచనలు చేశారు.

Tags: Public transport, nitin gadkari, lockdown, coronavirus

Advertisement

Next Story

Most Viewed