టీడీపీలో ఉన్నప్పుడు ఏం జరిగిందో గుర్తు లేదా కేసీఆర్ : గాదె ఇన్నయ్య

by Sridhar Babu |
Gade-Innaiah-And-Kcr
X

దిశ, వెబ్‌డెస్క్ : మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో త్వరలోనే హుజురాబాద్ ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య స్పందించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. హుజురాబాద్ ఎన్నిక దేని కోసం వచ్చిందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అయితే మీ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తారా అని విమర్శించారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఎవరినైనా తొలగించాలంటే.. దానికి ఓ పద్ధతి ఉంటుందని అన్నారు. కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంతలో వస్తువులను కొన్నట్టు రాజకీయ నాయకులు.. ప్రజలను కొంటున్నారు. ఇప్పటి వరకు 155 మందిపై బైండోవర్ కేసులు పెట్టారని ఆరోపించారు. టీడీపీలో ఉన్నప్పుడు మంత్రి పదవి ఇవ్వకపోతే మీకు అండగా నిలబడలేదా కేసీఆర్ అంటూ ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలి. ఈ విషయంలో కేంద్ర ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోవాలని కోరారు. ఉప ఎన్నికల సందర్భంగా హుజురాబాద్‌లో సదస్సులు పెడతామని ఇన్నయ్య అన్నారు.

Next Story

Most Viewed