మరో మృతదేహానికి జేసీబీతో అంత్యక్రియలు

by srinivas |
మరో మృతదేహానికి జేసీబీతో అంత్యక్రియలు
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల శ్రీకాకుళం జిల్లా పలాసలో కరోనా మూలంగా మృతిచెందిన ఓ మృతదేహాన్ని జేసీబీలో తీసుకెళ్లి, అంత్యక్రియలు నిర్వహించిన విషయం తెలిసిందే. దీని మూలంగా అధికారులు అనేక తీవ్ర విమర్శల పాలవడం కూడా తెలిసిందే. అయితే మరోసారి అలాంటి ఘటనే తిరుపతిలో జరిగిందంటూ టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిలో ఓ కరోనా రోగి మృతి చెందితే అమానవీయ రీతిలో అంతిమ సంస్కారాలు నిర్వహించారని వెల్లడించారు. ఈ విషయం దిగ్భ్రాంతి కలిగిస్తోందని ట్వీట్ చేశారు. గుంతలో మృతదేహాన్ని ఉంచడానికి జేసీబీని ఉపయోగించారని ఆరోపించారు. ఈ వీడియోను మృతుడి కుటుంబీలకు చూపించే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా? అంటూ ప్రశ్నించారు. చనిపోయిన వాళ్లకు ఏమాత్రం గౌరవం ఇవ్వరా? అంటూ నిలదీశారు. కాగా, తిరుపతిలో కరోనాతో చనిపోయింది ఓ టీటీడీ ఉద్యోగి అని తెలుస్తోంది.

Advertisement

Next Story