- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దామాషా ప్రకారమే నిధుల కేటాయింపులు..
దిశ, మహబూబ్ నగర్ : తెలంగాణ ప్రభుత్వం వివిధ అభివృద్ధి పనుల కోసం అందజేస్తున్న నిధులను జనాభా దామాషా ప్రకారమే కేటాయిస్తామని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి అన్నారు. సోమవారం తన కార్యాలయంలో జిల్లా పరిషత్ సీఈవో యాదయ్యతో కలిసి ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లా పరిషత్ విభజన జరిగినప్పటికీ ఉమ్మడి జిల్లా కేంద్రానికి రావడం తప్పడం లేదన్నారు.
ఆయా జిల్లాల నైసర్గిక పరిస్థితులను ఆధారంగా పరిగణలోకి తీసుకుని నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తామన్నారు. తాను పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నేటి వరకు 100 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినట్ల వివరించారు.జిల్లా పరిషత్ పరిధిలో 70 మంది అటెండర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ఖాళీల స్ధానంలో కాంట్రాక్టు పద్దతిలో తీసుకునే వెసులుబాటు లేదన్నారు. కారుణ్య నియామకాలు చేపడుదామంటే వారి పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించారని ఆమె చెప్పుకొచ్చారు. జిల్లాపరిషత్‌లో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. జీపీఎఫ్ పార్ట్ ఫైనల్ విషయంలో ఉద్యోగులు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని జెడ్పీ చైర్ పర్సన్ సూచించారు. సమావేశంలో కోయిల కొండ జెడ్పీటీసీ విజయభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.