Fun Bucket Bhargav : నేను మళ్లీ వస్తున్నాను.. మీ సపోర్ట్ కావాలి

by Shyam |   ( Updated:2021-07-22 02:56:25.0  )
Fun bucket Bhargav
X

దిశ, వెబ్‌డెస్క్: టిక్‌టాక్, యూట్యూబ్ వీడియోలతో ప్రేక్షులను తనదైన శైలిలో నవ్వించిన ఫన్ బకెట్ భార్గవ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల.. టిక్‌టాక్ వీడియోల పేరుతో ఒక మైనర్ బాలికను రేప్ చేసిన కేసులో భార్గవ్‌ను విశాఖపట్నం ‘దిశ’ పోలీస్ స్టేషన్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే జైలు పాలైన భార్గవ్ విడుదలైనట్లు తెలుస్తోంది. తాజాగా.. ఇస్టాగ్రామ్ వేదికగా ఓ పోస్టు పెట్టాడు. ‘‘నేను మళ్లీ వస్తున్నాను. నాకు ఎలాంటి సపోర్ట్ లేదు. నాకు మీ అందరి సపోర్ట్ కావాలి.’’ అని పేర్కొన్నాడు. అదికాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో భార్గవ్ జైలు నుంచి విడుదల అయ్యాడని స్పష్టం అవుతోంది.

Advertisement

Next Story

Most Viewed