- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తగ్గని పెట్రో మంట
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో పెట్రో మంట రాజుకుంటూనే ఉంది. ఈ వారంలో వరుసగా ధరలు పెంచడంతో దేశవ్యాప్తంగా చమురు ధరలు మరోసారి గరిష్ఠ స్థాయిలకు చేరుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరల పెరుగుదలే దీనికి కారణమని చమురు సంస్థలు చెబుతున్నాయి. ఈ వారంలో వరుసగా మూడోరోజు పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయిని చేరుకున్నాయి. గురువారం పెట్రోల్ 25 పైసలు, డీజిల్ 30 పైసలను పెంచుతూ చమురు మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయించాయి. ఈ పెంపుతో దేశవ్యాప్తంగా ధరలు కొత్త గరిష్ఠాలను తాకాయి. రోజురోజుకు ధరలు పెరిగిపోతూండటంతో వాహనదారులు వాహనాలను బయటకు తీసేందుకు భయపడుతున్నారు. చమురు మార్కెటింగ్ సంస్థలు రెండు నెలల వ్యవధి తర్వాత జనవరి 6న రేట్లను పెంచడం ప్రారంభించాయి. అప్పటినుంచి పెట్రోల్ ధర రూ. 4.14, డీజిల్ రూ. 4.16 పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ లీటర్‌కు రూ. 87.85కు చేరుకోగా, డీజిల్ రూ. 78.03గా ఉంది. హైదరాబాద్‌లో సైతం లీటర్ పెట్రోల్ రూ. 91.35కి చేరుకుంది. డీజిల్ రూ. 85.11 వద్ద ఉంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..
ముంబైలో పెట్రోల్ లీటర్‌కు రూ. 94.36, డీజిల్ రూ. 84.94
చెన్నైలో పెట్రోల్ రూ. 90.18, డీజిల్ రూ. 83.18
బెంగళూరులో పెట్రోల్ రూ. 90.78, డీజిల్ రూ. 82.72
కోల్‌కతాలో పెట్రోల్ రూ. 89.16, డీజిల్ రూ. 81.61